ఊరుగాలి ఈల :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆట మైదానాల పులకించు నేల ఆటగాళ్ళ కూతలో 
శిరశరీరాల అణువణువు ఆడించే కబడ్డీ
కల్లకపటం లేని ఐకమత్యం పెంచు మేలైన క్రీడాస్ఫూర్తి

పట్టు సడలని దీక్ష చదువుసంధ్య తోడు
చదువు వ్యాయామం విప్పారె చెట్టు నీడ బడి
వెలుగు వెలిగిన నేల బుద్ది గరిపిన బోధి చాలా

చదివిన బడిలోనే టీచర్లుగా వచ్చే
సంజీవరాజు యాదగిరిరాజు సద్గుణాచారి సార్లు
వెంకటపాపయ్య జనార్ధన్ రాజు శంకరయ్య సార్లు 

ఊరులో చదివిన కొందరు వేరుచోట్ల టీచర్లు
వెంకట్రావు మోహనాచారి రంగయ్య సార్లు 
అంజయ్య ఐలయ్య టి.సౌభాగ్య లక్ష్మి టీచర్లుగా

మరింక స్వరాజ్యలక్ష్మి టివిఆర్ కృష్ణ డా.టి.రాధాకృష్ణమాచార్యులు మా ఇంట
డా.బాబురావు డా.లక్ష్మణ్ రావు రాంబ్రహ్మాచారి జలేంద్రాచారి పలుసేవలలరి

అందరికి చదువిచ్చి ఆదరించిన బడి
వొడి వెచ్చవెచ్చన
తడితడిగ పచ్చగా బతికే బతుకిచ్చిన ఊరుకు సెల్యూట్ 

======================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Memories...are ** Star Ligts **