వాడు ...
'నువ్వు ,నేను ,మనం
అంతా ఒకటె 'అంటాడు !
'మన కులం ,ఉప -కులం
ప్రాంతం ఒకటే 'అంటాడు !
కలసిమెలసి -
వుండాలంటాడు ....
అన్నీ బాగానే ఉంటాయ్ !
సమయంవచ్చినప్పుడు
నలుగురూ కలిసే
అవకాశం ఉన్నప్పుడు
నిన్నూ -నన్నూ -వాడు
అసలుపిలవడు ....
సమాచారం అసలు ఇవ్వడు !
ఎందుకో తెలుసా ...
అతగాడి భయం అతడిది
అతని అస్తిత్వాన్ని ,స్టెటస్ ని
గ్రద్దలా ...
ఎవడు తన్నుకుపోతాడోనని
ముందస్తు జాగ్రత్త ..అంతే !
ఇలాంటి వాళ్ళతో
ఐకమత్యం వస్తుందా ....
శతృ పలాయనం జరుగుతుందా ?
ఇలాంటివాడిని నమ్ముకుంటే
బక్కవాడికీ ..బడుగువాడికీ
మంచిరోజులు వస్తాయా ...?
మనలోనే దళారులుంటే
మన స్వాతంత్య్ర ఫలాలు
నిష్కర్షగా ----
మనకందుతాయా .....!?
***
'నువ్వు ,నేను ,మనం
అంతా ఒకటె 'అంటాడు !
'మన కులం ,ఉప -కులం
ప్రాంతం ఒకటే 'అంటాడు !
కలసిమెలసి -
వుండాలంటాడు ....
అన్నీ బాగానే ఉంటాయ్ !
సమయంవచ్చినప్పుడు
నలుగురూ కలిసే
అవకాశం ఉన్నప్పుడు
నిన్నూ -నన్నూ -వాడు
అసలుపిలవడు ....
సమాచారం అసలు ఇవ్వడు !
ఎందుకో తెలుసా ...
అతగాడి భయం అతడిది
అతని అస్తిత్వాన్ని ,స్టెటస్ ని
గ్రద్దలా ...
ఎవడు తన్నుకుపోతాడోనని
ముందస్తు జాగ్రత్త ..అంతే !
ఇలాంటి వాళ్ళతో
ఐకమత్యం వస్తుందా ....
శతృ పలాయనం జరుగుతుందా ?
ఇలాంటివాడిని నమ్ముకుంటే
బక్కవాడికీ ..బడుగువాడికీ
మంచిరోజులు వస్తాయా ...?
మనలోనే దళారులుంటే
మన స్వాతంత్య్ర ఫలాలు
నిష్కర్షగా ----
మనకందుతాయా .....!?
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి