ష్..... ప్లీ జ్.....! :- కోరాడ నరసింహా రావు!

 ప్రతీ నామ,రూపము... 
 ఈ సమాజంలో చలామనీ అవుతున్న నాణెమే ! 
   నాణె మన్నాక...బొమ్మ - బొరుసు రెండూ సహజమే 
   వ్యక్తి కైనా, వస్తువు కైనా  
 కనిపింపజేసే వెలుతురు లాగే,ఆ ఆకారానికి వెనుక నీడ చీకటిలా మసకగాఉం డే తీరుతుంది...అది ఆస్ప ష్టమే!వాదనకు దిగితే,యే ఒక్కరూ గెలవ లేరు..! ఇది సత్యము!! 
      ఎవరైనా... కనిపించే వెలుతురునే ఆస్వాదించి ఆనందించాలి గాని, భ్రమింపజేసే చీకటిలోపడి కొట్టుకోవచ్చా... అది వివేకమా..!? 
    ఆది మానవుని నుండి నేడు అధునాతనంగా ... నేటి నవ నాగరికునిగా
రూపాంతరం చెందిన క్ర మంలో... అవసరాను కూలంగా ఎన్ని మార్పులు
 ఎన్నెచేర్పులు...
  అప్పటికవి తప్పని సరి అవసరాలు ! 
 ప్రస్తుతానికి పనికి రానివి ఎన్ని కాలగర్భంలో కలిసి పోలేదు!! 
   కొందరు నేడుమిక్సీలొచ్చి నా... ఆనాటి రాతి రోళ్లు , సన్నెలే వాడు తున్నారు , వాలని నవ నాగరీకులు కొందరు అవహేలన చేస్తా రు! 
  వీరు మిక్సీల్లో ఉండే సుఖాన్ని చూస్తే , వారు అందులో ఉండే ఆరోగ్యా న్నే చూస్తారు ఎవరి దృష్ఠి వారిది, ఇందులో ఎవరిది రైటు అనాలి..?! 
   మీది గొప్పా - మాది గొప్పా అని వాదించుకునే బదులు... ఎవరిది వారికి గొప్ప అనుకుని, ఊరు కున్నంత ఉత్తమం లేదు క దూ...! 
   ఈ సమాజం లో ఎవరికి నచ్చి నట్టు  వారిని బ్రతక నివ్వండి....ఒకరి కులాన్ని, మతాన్ని వే రొకరు ప్రశ్నిం చవద్దు..., 
  గతాన్ని తవ్వి తలకెత్తుకో వద్దు...ఇప్పుడిప్పుడే
మానుతున్న పండును కెలికి,సెప్టిక్ ఐపోయి సమాజ మనుగడ ముగిసి పోయేలా ప్రవర్తించ వద్దు! 
   వాదాలతో.. విబేధాలు, వివాదాలతో...అలసి, సొలసి... ఇప్పుడిప్పుడే సేదతీరుతున్న సమాజా న్ని కాస్త ప్రశా0తంగా ఉండ నివ్వండి... ప్లీ జ్...! 
      ******
కామెంట్‌లు