సుప్రభాత కవిత : -బృంద
సెలయేటి ఒడ్డున స్వేచ్ఛ 
మెరిసేటి పువ్వై విరిసింది 
దరిచేరు జలధార కోసము
పరిమళము  ప్రేమగా పరచింది

అదుపులేవి లేని ఆనందము 
కుదుపులు లేని జీవనము 
ఫిర్యాదులు లేని మనము 
వరముగ పొందిన సుమము

చిరునవ్వులు కురిసే జీవితాన 
సిరి మువ్వల సందడులే 
సరిగమలై వినిపించే 
విరిజల్లుల నాట్యాలు

నీటి మీది బుడగలే 
మన అందరి జీవితాలు 
కలిపి వుంచు కలిమి ప్రేమే 
కావు ఏవీ శాశ్వతాలు

పలకరించు ప్రేమలు 
కలుపుకునే బంధాలు 
బలపడే అభిమానాలే 
నిలుపుకునే  నిలువలు!

ఇచ్చినవే తిరిగి మనకు 
వచ్చునని తెలిసి
ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు 
వచ్చే జన్మకు అవే వరాలు!

మంచిని పెంచి మనసున ఉంచి 
మనుగడ మధురం చేసే వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు