గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం.తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా మహిళలలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజు ఆండాళ్- శ్రీ రంగనాథుల కల్యాణం జరిపించడం వల్ల ఈ వ్రతం ముగుస్తుంది.తిరుప్పావైలో పెరుమాళ్‌ను స్తుతిస్తూ పాశురములుగా సూచించబడే ముప్పై చరణాలు ఉన్నాయి . ఇది తమిళ సాహిత్యంలోని భక్తి శైలిలో ముఖ్యమైన భాగమైన ఆళ్వార్లు అని పిలువబడే పన్నెండు మంది కవి-సన్యాసుల రచనల సమాహారమైన నలయిర దివ్య ప్రబంధంలో ఒక భాగం.తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను పాడాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ద్రావిడ సంప్రదాయం ప్రకారం ఈ నెల రోజులూ ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం నిర్వహిస్తారు. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్.. ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. రంగనాథుడినే భర్తగా పొందింది. కనుక ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైలోని పాశురాలను రోజుకొకటి చొప్పున పఠిస్తూ శ్రీమహావిష్ణువుని కొలిచిన వారికీ కొంగుబంగారమని శాస్త్రాలు చెబుతున్నాయి. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులూ పెళ్లికానివారు తిరుప్పావై పఠించడం వలన మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాల కథనం
తిరుప్పావై విశిష్టత:-- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి