అదే.... పూర్ణత్వం....! :- కోరాడ నరసింహా రావు
ఎవరికి వారే  యమునా తీరే... 
  ఎవడి సుఖము  వాడిది
    ఎవడి కష్టము వాడిదే...! 

సమిష్టిగా సుఖాలను పొంద టానికి... కష్టాలను అధిగ మిం చటానికి సాంఘికుల మైనా.... 
 మనం నిఖార్సైన స్వార్ధ
పరులమే...! 

నేను బాగుండాలి... నేనే బాగుండాలి..!నేనుసుఖపడాలి
నేను... నేను... నేను... నేను... 
 నాది... నాది... నాది... నాది... 
  నాతరువాతే  ఎవరైనా...ఎవరికైనా...!! 

తృప్తేది... ఆనంద మెక్కడ... 
 సంతోష మెప్పుడు...!?!? 

ఎదిటి వాడ్ని పీడించైనా నేను సుఖ పడాలి...! 
  వాడ్ని ఏ డి పించైనా... నే నానందంగా ఉండాలి...!! 

కుట్రలు , కుతంత్రాలు ఇందుకోసమే... 
  మాయలు , మోసాలు ఇందుకోసమే.... ! 

దోచుకోటాలు... దాచుకోటాలు
 మురిగి పోయి, కుళ్లి-కంపు !! 

అలజడి- ఆందోళన... 
 పాపపు రోగం పట్టి... 
 అసహనం - అశా0తి ! 

ఓ మనిషీ...! 
  ఇక్కడ యేదీ , ఎవరి కీ సొంతం కాదు..! 
 గాలి, నీరు , వెలుగు టోపాటు
 అన్నీ, అందరికీ సమానమే! 

దోచుకోవా ల ను కోకు... 
   దాచు కోవా లనుకోకు... 
 అ న్నీ  ఇక్కడే, ఇలాగే ఉండి పోతాయి... 
 ఎలా వచ్చామో... ఆలాగే పోయేది మనమే...! 

ఎదుటి వారిని సుఖ పెట్టటం లోనే  సుఖాన్ని పొందటం నేర్చుకో... 
 ఎదుటి వారి ఆనందానికి ఆనందించటం అలవాటు చేసుకో... 
   ఇదే మానవత్వం.... 
 ఇదే మనిషి తత్వం .... 
 అదే... పూర్ణత్వం...!!

కామెంట్‌లు