ఊరుగాలి ఈల:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మట్టిలో పుట్టిన జీవాలలో మనిషి అద్భుతం
మేధ కన్నా గొప్ప దయలూరు మనసున
ఊరు ఊరంతా నింగినేల ఎగిరే శ్రమపతాక 

పట్టెడ కుంపటి మూసపని ఆగయ్య
వడ్ల బ్రహ్మయ్య కమ్మరి మల్లయ్య పాట
మేర మల్లయ్య కుట్టిన అంగీల ఊరు 

మట్టితెర దాట రాంనర్సి ఇల్లే మదిర వాసన 
వాకిల్ల గలగల వంపే చేతి బింకి చిరునగవు 
గౌడు గీసిన తాటికళ్ళు దీర్చె అలసిన పల్లె  

దినుసులెల్ల అమ్మిన వ్యాపారుల ఊరు 
దొడ్డ పిచ్చయ్య చంద్రమౌళి సోమయ్య,
మాడిశెట్టి రాగమ్మ రంగయ్య నర్సయ్య, 
నల్మాస భద్రయ్య వెంకయ్య నర్సయ్య కోమట్లు వీరు 

కోమాళ్ల మంగయ్య శీనయ్య కాంతయ్య 
నర్సయ్యల త్రయం
అల్లం నర్సయ్య రంగయ్యాదుల సేద్యం

పేక పడుగుల అల్లిక మగ్గాల శాలోల్లు
చాకలి కొమురయ్య మంగలి మల్లయ్య 

తెనుగోల్ల రోశయ్య నర్సయ్య తోటల ఊరు

గొల్లోల్ల గొర్రెమందలు ఎరుకలల్లిన చాపలు బుట్టలు
ఆవు బర్రెల పాడిపెరుగు ఎద్దు దున్నల  
చెలుక చేను
ఆటపాటల దరువు ఊరు ఆదరువు చెట్టు చెరువు

=================================

(ఇంకా ఉంది)
కామెంట్‌లు