ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో,ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్దులకు ఉపయోగ కరంగా ఉండే విధంగా 2025వ సంవత్సరపు క్యాలెండర్ ను పోస్టుకార్డు పైన రెండు విధాలుగా తయారు చేయబడినది.అందులో మొదటి విధానంను జనవరి 2025 మొలక మాసపత్రికలో ప్రచురణ కాబడినది.రెండవ విధానంను ఇప్పుడు చూద్దామా రండి.
రెండవ విధానం
పోస్టుకార్డును అడ్డంగా తీసికొని దానిపైన 12 అడ్డు గడులు,7 నిలువ గడులలో రూపొందించిన ఈ క్యాలెండర్ లో మొదటి 7 గడులలో 12 నెలల పేర్లు,వాటి క్రింద వారంల పేర్లు వరుసగా వ్రాస్తూ, వాటి ఎదురుగా ఉన్న మిగతా గడులలో 1 నుండి 31 వరకు తేదీలను వ్రాయబడినవి.
వారం పేరు తెలుసుకోవడం ఎలా చూద్దామా రండి
ఉదాహరణకు: తే 26.01.2025 ది ఏ వారం అగును?
వివరణ: మనకు కావలసిన జనవరి నెలలో దిగువగా 26 వ తేదికి అడ్డంగా ఎడమ వైపు చూస్తే ఆది అని ఉంది.(అడ్డంగా,నిలువగా రెండు ఖండించిన దగ్గర).అంటే తే *26.01.2025 ది ఆదివారం అవుతుంది. ఈ సంవత్సరం మనకు గణ తంత్రదినోత్సవం ఆదివారం అవుతుంది.
మరో ఉదాహరణ:
తే :14.11.2025 ది ఏ వారం అవుతుంది?
వివరణ: మనకు కావలసిన నవంబర్ నెలలో దిగువగా,14 వ తేదికి అడ్డంగా ఎడమ వైపు చూస్తే శుక్ర అని ఉంది.అంటే తే: 14.11.2024ది శుక్రవారం అవుతుంది. ఈ సంవత్సరం బాలల దినోత్సవం మనకు శుక్రవారం అవుతుంది.
పోస్టుకార్డు పైన 2025 క్యాలెండర్:- మడ్డు తిరుపతి రావుM.Sc.,M.Edగణిత అవధాని & టీచర్-బూరగాం*కంచిలి* శ్రీకాకుళం-9491326473
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి