ప్రేయసి ప్రేమ ప్రియ రసికతలో ఊరేగే శృంగారమే
ప్రణయ సీమలదేలు నాయికా నాయక జీవకళ
రసభాషల నిగూఢ సైగల గూవ్వగూడీ మధువని
మిసిమి అందాల పూల గంధాలు విరిసే శోభలు
ఊరు శిరమెత్తిన తీరు పాఠాల సెలయేరు ఊరు
పరుగుపరుగన పాకే పాయల తడి ఎదప్రేమసీమ
ఆమె అతడంటే అమ్మానాన్న కలల కళ బతుకు
అన్ని తానై నడిచే పల్లెసీమ బాధల కడతేర్చు గీత
పరదాల సరదాలు చిత్రమే ఆలకించ యుగళగీతి
పల్లెపైటంచు పగిడిపోత మనసు పాటే బార్ బార్
ఇష్టం ఇష్క్ ప్రేమ లవ్ ప్యార్ అన్నీ ఊరు దీప్తిదిల్
నొప్పిలేని ప్రేమ తీయనైన బాధల ఎగిరే ఊరురెక్క
పుట్టిన నేల నాదను మట్టి కాదదీ ఊరు ఆత్మతేజ
కలబంద మొక్క కాగితం ముక్క రాసే పల్లెకావ్యం
వేళ్ళు నావి కొమ్మలు ఆకులు నీవి అందాలే ఊరు
లోతుల ఆలింగన కైదండ జలపాతం ఊరుతడి
మనలో మాట వినం బైట తల ఊపు ఊరేకాపు
పల్లె భోళా మనిషి బేల మనిషి చెక్ ఊరు తేనీరు
తలవంచని మనసు తలదించే మనిషి కల ఊరు
కలతలు కవితలు జంటకవులే ఊగే తొట్లే పల్లెరా
ఆదరువు ఆధారం ఆనుపాను అన్నీ మనిషీ ఊరే
===============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి