]బ్రెయిన్ డ్రేన్ పోరు లైఫ్ వలసల మెరికలు ఊరు
గ్రీన్ కార్డు సొంత ఇళ్ళు వలస సలసల పోటేపవర్
అభద్రత అటోఇటో తేలని ఊగిస డాలర్ ఊరెలా!
అమ్మ నాయిన మంచీ మమత బాసే ఊరువాసి
ఇల్లువాకిలి గొడ్డుగోద పేద పైరుపంట సేదలేని చేద
నిద్రలేని వాకిలి బర్రెగొర్రె నిద్ర పాదముద్ర పల్లెపొద్దు
అంతులేని ఆశ రక్తమాంసం పీల్చే కాన్పుకే అమ్మ
చేయ్యి చెమట కనలేని అమ్మప్రేమ మగే ఆడేబాధ
ఊరుగొప్ప పేరుదిబ్బ కాదు పల్లెసీమ మాటేఊరు
ఇంద్రధనుసు రంగుల నింగి ఉద్వేగ రక్తం ఊరేపద
పిల్లల పెంపకం గొప్పగొప్ప చెప్పకు అల్లరే ఊరు
పెద్దల ఆనందం ఆకాశం కడుపుగోకే తీపి బంధం
వేకువ చీకటెంట చీకటి వెలుగెంట పల్లె బతుకే గిరి
కడుపు గట్టి అమ్మచేతి తీపిబువ్వ కారం పల్లెనవ్వే
పొరుగు పుల్లకూర రుచి ఊరేగే మనింటి తీపిచేదా
వానతడి పొడి ఎండపొడ తడి వేరే ఒక్కటి ఊరే
కాయకష్టం మదిఇష్టం సంగతి గానాబజానా పల్లే
ఆపద అబద్ధం సోపతి నేరం శిక్ష కొరడా దెబ్బేపల్లె
చివరకు మిగిలేది మంచీ ప్రేమ దయ పల్లేగుండె
ముగియని ఆట మైదానం అలిసే బతుకు కల
ఊరు ఊరే మనిషి మనిషే గొప్పపేద మనీ లైఫే
==================================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి