ఒక ఊరిలో నరసయ్య అనే వ్యక్తి ఉండేవాడు.అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి చెట్లను నరికేవాడు.
వాటిని మోపుగట్టుకొని వేరే గ్రామాలకు వెళ్లి అమ్ముకుంటూ డబ్బు సంపాదించేవాడు.ఇలా ప్రతిరోజు చెట్లను నరకడం వలన అడవి అంతా ఖాళీ ప్రదేశం ఏర్పడింది.అప్పుడు గాలికి,నీడకు,నీరుకు,ప్రకృతికి ఇంత చెడు జరిగిందని మనసులో
బాధపడుచున్నాడు.
"చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏంలాభం"అని కుమిలి కుమిలి ఏడ్చుచున్నాడు.
ఒకరోజు తన బావి దగ్గర నిద్రించుచుండగా వనదేవత ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడింది.
నరసయ్య నీ బాధను నేను అర్థం చేసుకున్నాను.
నీ బాధను పోగొట్టే మార్గం చెబుతాను విను.
నరికిన చోటల్లా చిన్న మొక్కలను తెచ్చి నాటు.
వాటికి ప్రతిరోజు నీళ్లు పోయు అవి మళ్లీ మహావృక్షాలుగా పెరిగి వనం తయారవుతుంది. ప్రకృతి పచ్చగాఉంటుందని చెప్పి మాయమైంది.
ఆ రోజు నుండి నరసయ్య చెట్లను పెంచసాగాడు.
ఇతరులకు కూడా చెట్లుచేసే మేలు గురించి చెప్పసాగాడు. చెట్ల వలన వర్షాలు వస్తాయని, మంచి ప్రాణవాయువు దొరుకుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని తెలుసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
అప్పుడు వాటి పండ్లు, పువ్వులను అమ్ముకుంటు జీవనాన్ని కొనసాగించాడు.
పశ్చాత్తాపానికి మించినది ఏమిలేదని తెలుసుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి