ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
 10.
బాల ధ్రువ దీక్ష మెచ్చి, ఆకాశాన నక్షత్రం చేసావు!
భక్త ప్రహ్లాదుని అనుక్షణం,
 కంటి రెప్పవై కాచావు! 
ఉత్తర గర్భస్థ శిశువును ,
అస్త్రం నుండి రక్షించావు! 
కుబ్జకురూపం హరించి, అసమానసౌందర్య మిచ్చావు! 
ఆనాడు కుచేల దారిద్ర్య, ధ్వంసకా, మా సింహాచలేశా!
11.
అమ్మ కుంతి ఆరాధన, తనయుల అండ నిలిచావు! 
నిండు సభ మానిని,
ద్రౌపది ప్రార్ధన విని బ్రోచావు! 
సుభద్ర అర్జునుల ప్రణయం, 
పరిణయం చేసినావు! 
శశిరేఖ అభిమన్యుల్ని,
ఒకటి చేసి మురిసావు! 
గర్భశోక గాంధారి ,
శాపస్వీకర్తా,మా సింహాచలేశా!
12.
భక్త రామదాసు మొర,  
విని తానీషాని కలిసావు!
సంగీత బ్రహ్మ త్యాగయ్య, కీర్తనల నిలిచి ఉన్నావు! 
అన్నమయ్య పదాలతో, ఆనందాల ఊయల ఊగావు!
దోపిడీ దొంగ దారి మరలించి, రామదారి చూపావు! 
వ్యాసవ్యధ భాగవత కథ, అయ్యే, మా సింహాచలేశా!
________
.

కామెంట్‌లు