జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం
===============================
ఆడబిడ్డ వల్ల యవనియే వెలుగును
వారు లేని నాడు వసుధ లేదు
వసుధ లేని నాడు వచ్చును యాపద
పుండలీకుమాట పూలబాట
తల్లి లేని నాడు ధరణియే చీకటి
చీకటింటి బ్రతుకు చింత తెచ్చు
తల్లి యున్న నింట తామసి చేరదు
పుండలీకుమాట పూలబాట
ఆది శక్తి యమ్మ మదిలోన నున్నను
భయము దరికి రాదు భవిత వెలుగు
భవిత లేని నాడు బ్రతుకంత చెడుచుండు
పుండలీకుమాట పూలబాట
ఆత్మబంధు యమ్మ యనురాగ మూర్తియే
ఆడపిల్ల యనగ యవని తల్లి
ఆదరించ వలయు యనుదినమ్ము మనము
పుండలీకుమాట పూలబాట
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి