పలు శిల్పకళాఖండాలతో
చక్కబడ్డ ఈ ఆలయం
కొలువైయున్న మా దైవం
శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం !
సామాన్యులు మాన్యులై
భక్తితో తరించారు ఇక్కడ
భూతల స్వర్గాన్ని తలపించే
ఇలాంటి ఆలయం లేదెక్కడ !
పచ్చని ప్రకృతి తీరొక్కఅందాల
అలంకరణతో అలరారుతుంది
చక్కని ఆకృతి గల శిల్పాలతో
మురిపిస్తూ మరిపిస్తూనే ఉంది !
అజంతా ఎల్లోరా ఖజురహో
తరహా అందాలు ఇందున్నవి
రోజంతా మోజంతో పెంచుకొని
దర్శిస్తే ఆనందాల హరివిల్లౌతుంది
యజ్ఞాలకు యాగాలకు
నిలయమైన ప్రదేశము
యోగులకు బోగులకు
అందిస్తుంది శుభసందేశం !
నాలుగు దిక్కుల మెడలెత్తి
చూసే రాజా వీధి గోపురాలు
వాడ వాడాల జాడ తెలుపు
మాడ వీధుల మూపురాలు !
వేదాలను ఘోషించే గిరులు
అందాల ఆనందాల తరులు
కూడుకున్న మన దివ్య క్షేత్రం
మన యాదాద్రి రమ్య ప్రాంతం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి