ఏమైపోయావే నీవేమైపోయావే
నా కంటికి నువు కనబడకుండా
నా ఇంటికి అసలే ఇక రాకుండా
నను ఒంటరివాడినిచేసి వెళ్ళావే!
ఏమైపోయావే పిల్లా ఏమైపోయావే
ఎలాగ వెతికేదే నే ఎంతని వెతికేదే
చిక్క లేదుగా నీ చిరునామా నాకు
చిక్కుల్లో పడి ఎంచెప్పను నేసాకు!
ఎటు వెళ్లావో చెప్పక చేయక నీవు
మటుమాయము అయిపోయావు
నా బ్రతుకు ఆయనుగా ఇక వ్యర్థం
నీ వస్తే ఇక కలుగునులే పరమార్థం
నను విడిపోయి ఇక నీవు అక్కడ
నిన్ను విడిచి ఉండలేను నేనిక్కడ
నీవెక్కడ ఉన్నావో ఏమైపోయావో
పిల్లా దహించిపోతున్న నిలువెల్లా !
రేయనక పగలనక నే తపిస్తున్న
నిత్యం నీ నామాన్నే జపిస్తున్న
ఎక్కడికి పోయావో నన్ను విడిచి
చిక్కలేక ఉన్నావులే నన్ను మరచి!
పోయిన నిన్ను నేను మరవలేక
హాయిగా కాలాన్నిక నే గడపలేక
నాబాహుల్లోకి వస్తావని భావిస్తున్న
నీ ఊహల్లోనే నేనిక జీవిస్తున్నా. !
ఏమనుకొని వెళ్లావు నన్ను విడిచి
ఎప్పుడు తిరిగొస్తావో నీవు నడచి
నీకోసం నేను ఎదురు చూస్తుంట
నా దరిదాపుల్లోకి నీవిక వస్తావంట
అప్పుడే నీకు నాకు సుఖం కలుగు
వచ్చులే జీవితాన మనకిక వెలుగు
మన మధ్య దూరభారము తొలగు
చెలిమి కలిమే మనకిక మిగులు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి