జీవితం:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
మన జీవితం ఒక నాటకం
మూన్నాళ్ళ అచ్చట ఇచ్చట
ముచ్చటై తరిగిపోవు నట్టేట
కట్టై కాలిపోవు వట్టి బూటకం !

తిరుగుతుంది రంగులరాట్నమై
పెరుగుతుంది కొంగుల కట్నంమై
ఆరాటాల ఆర్భాటాల కొట్నమై
పోరాటాల  కొంగు బంగారమై

పుట్టుట గిట్టుట కోసమే
మన పొట్టకై పగటివేషమే
ప్రాణం పోయేది నిమిషమే
నిస్త్రాణంతో కూడిన విషమే !

పెను చీకటి వెలుగుల మయమై
కను వాకిటి పలుగుల మయమై
మోయని మాయని గాయమై
చివరకు మిగులు అది హేయమై !

.పోరాటం బాటను తెగ పట్టిస్తూంది
ఆరాటం వేటను పొగ పెట్టిస్తూంది
ఆరాటాల పోరాటాల సత్పలితం
వడువని విడువని విధి లిఖితం !

ప్రాయంలో సెగలను పొగలను కక్కిస్తూంది
సంతానంకై రాళ్ళ రప్పలకు మొక్కిస్తూంది
ఉన్న ఆస్తిపాస్తులను పూడ్చేస్తూంది
చిన్నగా పస్తులతో కడుపును మార్చేస్తుంది !

పెను ఇబ్బందుల సృష్టిస్తుంది
పలు కష్టాలను కొని తెస్తుంది
జీవితమంటే ఇక విసుగేస్తుంది
జీతం ఉంటేనే పస పనిచేస్తుంది!

మన కాయం బుద్భుత ప్రాయమని
తెలసి మసలుకొనుటే ధ్యేయమని
అనుభవాల సారాన్ని మనకిస్తూంది
ప్రభవాల పాఠాన్ని మదికెక్కిస్తూంది

అర్థం చేసుకొని ఆచరించు మనిషి
పరమార్థం గైకొని అవుతావు రుషి
జీవితమంటే కాదులే ఇక ఆశామషి
జీవితమంటే తెలుసుకో ఓ మనీషి !

కామెంట్‌లు