ఓ నా స్నేహితుడా !:-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్కర్నూల్ జిల్లా.
హితుడా  ఓ నా స్నేహితుడా
హితవు కోరు నా సన్నిహితుడా
ఏడా నీ జాడా నిన్ను నే చూడా
కనబడకా పోతున్నదీ నీ నీడా !

మిత్రుడా ఓ ధీరోదాతృడా
మా రాజీవా ధర నేతృడా
ఊరిడిచి వెళ్ళావు ఎందుకు
తిరిగి రాకున్నాను ముందుకు?

మిత్రమా మాదివ్యకళా నేత్రమా
విధివంచిత  గేయగాయ గాత్రమా
ఊరు విడిచి మమ్ము మరచి నీవు
మము వీడి మరి ఎక్కడికెళ్ళినావు

చెలిమి చేసి వెళ్ళిపోయినోడా
కలిమి చూసి గూడా రానివాడా
నీమేడ విడిచి వెళ్ళావెందుకు ఈడ
మావాడకు వొస్తే చూస్తాం నీజాడ

మా మంచి దోస్తి నీకు లేదులే మస్తి
ఊరు విడిచి వస్తి నే తిరగలేక గస్తి
మీరుంటే ఇక ఎక్కడపోదు నాఆస్తి
అందుకే మిమ్ముల వదలేసి నే వస్తి
చెలిమి కలిమి కలిగిన మిత్రుడా
మా స్నేహశీలవైన ధీరోధాత్రుడా
నీ జాడ ఏడ తెలియక కలిగే పీడ
దానితో మా గుండెల్లోన కల్గె దడ !

స్నేహమే ప్రాణమై జీవించు వాడా
ద్రోహం అనేది అసలే ఎరుగని రేడా
నీ జాడ కోసం వెతికాం వాడ వాడా
నీ అడ్రస్ ఇస్తే వస్తాం నిన్ను చూడా

ఓ చెలిమి చలువ స్నేహితుడా
మా మేలిమి బంగారం హీతుడా
చివరకు విన్నావుగా మా వినతి
వేరవక నీవు ఇవ్వు మాకు ఆనతి

హితుడా  సన్నిహితుడా స్నేహితు డా
మేమంతా వెతికి తీస్తున్నాం మీ జాడా
మేమందరం ఉంటాంగా ఇక మీ
 తోడా
స్నేహ గీతం పాడుదాము  ఎడా పెడా. !


కామెంట్‌లు