నవ్వులు నవ్వులు నవ్వులు
నవ్వులు ఆనందాల పువ్వులు
ఆరోగ్యాన్ని కలిగించును నవ్వులు
వైరాగ్యాన్ని తొలగించును నవ్వులు
కులాసగాను నవ్వుతూ ఉంటే
విలాస మై మన జీవితం ఉంటే
గొడవన్నది లేదులే ఇక మనకు
ఎవరేమన్నా మరి నీవిక వినకు !
నవ్వులు నవ్వులు నవ్వులు
చలచల్లని వెన్నెల నవ్వులు
మంచు ముత్యాల తొవ్వలు
కంచు రత్నాల మువ్వలు. !
నవ్వుల క్లబ్బులు స్థాపించు
ఆరోగ్యంపైన శ్రద్ధ వహించు
నవ్వుల దీపాలను వెలిగించు
కలకాలం హాయిగా జీవించు.!
నవ్విన నాప చేను పండదా
రువ్విన సామెత మనకుండగా
శని గిని అని మీరు అనుకోవద్దు
గిలిగింతలతో ఉంటేనే ఇక ముద్దు !
నవ్వుల నజరానాల ఇప్పించి
పువ్వుల ఖజానాను తెప్పించి
మనం వారకి సమంగా పంచి
నవ్వులతో ఉండాలి తలవంచి!
నువ్వు లే పువ్వులై విరియాలి
పువ్వులే తేలియలై కురియాలి
విరిసిన కురిసిన ఆ నవ్వులు
మురిసే మనసుల పువ్వులు!
నువ్వు నవ్వులు నవ్వులు
కన్నుల కాంతులవెలుగులు
అన్నుల మిన్నుల కలువలు
మెరిసే రిసేసే మేని వలువలు!
నవ్వులు నవ్వులు నవ్వులు
ఆరోగ్యం పాలిటి మన పువ్వులు
నాలుగు విధాల చేటనుట తప్పు
నాలుగు విధాల మేలనుటే ఒప్పు !
ఇక అర్థం చేసుకొని ఆచరించండి
ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి
నవ్వుల విలువలను ఇక పంచండి
నవ్వులు రువ్వుతూ జీవించండి. !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి