పిల్లలం-మల్లెలం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
పిల్లలం పిల్లలం
మేం బడి పిల్లలం
మల్లెలం మల్లెలం
తెల్లగున్న మల్లెలం !

బడికి మేము పోతుంటాం
గుడికి కూడా వెళుతుంటాం
గుడిలోన చదువుకుంటాం
బడిలోన ఎదుగుతుంటాం !

అమ్మా నాన్న లేనివారాలం
కూడు గూడు లేని పోరలం
గుడి ప్రసాదం మా ఆహారం
బడి తోటలో మా విహారం !

బడిలో చదువు నేర్చుకుంటాం
గుడిలో ప్రార్థన చేసుకుంటాం
బడిలోని గురువు అంటే ఇష్టం
 దైవదర్శనంకు పడతాం  కష్టం !

మా బడి తోటలో శ్రమిస్తాం
దేవుని గుడిలో

విశ్రమిస్తాం
బడిలో గురువులతో నివాసం
గుడిలో భక్తులతో  సహవాసం !

తోటి పిల్లలతో మేం కలసిఉంటం
కలిసిమెలిసి ఉంటే మంచిదంటం
చదువులో అంతా ముందుంటం
ప్రథమ  శ్రేణిలో పాసౌతుంటం!

కామెంట్‌లు