పల్లవి:
అయ్యా ..మీకో... దండం
ఓ.. రయ్యా.. మీకో... దండం
నరకొద్దు చెట్టు చేమను
చెరపొద్దు పచ్చదనమును
/అయ్యా/
1చరణం:
కొండ కోనలు వనములు
ఎగసిపడే జలపాతాలు
సుందరమైనదీ ప్రకృతి
చేయోద్దు మీరు వికృతి
/అయ్యా/
2చరణం:
ఆకాశమంటే భవనాలు
నేలవిడిచి సాములు చేయడాలు
సకలజీవకోటికి మరణశాసనాలు
ఆచితూచి అడుగులు వేస్తేచాలు
/అయ్యా/
3చరణం:
పచ్చని పంటపొలాలు
పాడి పశుసంపదలు
కాలుష్యపు కాసారాలు
మనిషిబ్రతుకే నరకప్రాయాలు
/అయ్యా/
4చరణం:
సోలార్ పవరు వాడి
పొలుష్యందూరంచేద్దాం
సహజఇంధనాలు వాడి
సుఖశాంతులతో జీవిద్దాం
/అయ్యా/
ప్రకృతిని వికృతి చేయోద్దు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి