బ్రతుకంటే పోరాటము :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
బ్రతుకంటే
పోరాటం
కానీ 
 చేవలేనితనంకాదు
బానిసత్వం అసలే కాదు 

బ్రతుకంటే
ఒక లక్ష్యంతో
జీవించడం
కానీ
ఏలాగో అలా
బ్రతికే యడం కాదు
ఆశలు ఆకాంక్షలు
ఆత్మాభిమానం తో
అల్లుకున్నదే
మన (నీ) బ్రతుకు 

బ్రతుకంటే
 పూలబాటే కాదు
ముళ్ళబాటకూడా
జయాపజయాల
సంగమం

బ్రతుకంటే
సంఘీభావం
బ్రతుకంటే
నాయకత్వ పటిమ,
మార్గదర్శకత్వం

బ్రతుకంటే
ఎవరికి వారు బాధ్యతగా
తీర్చిదిద్దుకోవలసిన
జీవన ముఖచిత్రం


కామెంట్‌లు