కొత్త వలపు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
క్రీగంటి చూపుల  ఊరించి
కంటి కునుకే దోచె 
ఆకుపచ్చ మేను 
ఎలనాగ ఎక్కడో కాదు
ఆమె సిగపూల అందాల ఊగే నగ నాగరం

ఎవరినో ఎక్కడికో
తీసుకెళ్ళే రుచి పులుపు
వేవిళ్ళ పిలుపు తొలివలపు
తొలి నవ్వు అనుభవం అత్తింట 
మగని ఆటల మగనాలి పాట
పులకింత దాంపత్య జంట
దోర మామిళ్ళ తోట


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Graceful and రొమాంటిక్ సాంగ్. కంగ్రాట్స్