కలం సందేశం:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
మంచిదైతే ఆశయము
అదే అభినందనీయము
సొంతమైతే విజయము
పల్లవించు ఆనందము

తెచ్చిపెట్టు క్రమశిక్షణ
అపారమైన గౌరవము
జీవితాలకు రక్షణ
చివరికదే ఆదర్శము

దిద్దుకుంటే జీవితము
జరుగుతుందోయ్! అద్భుతము
లేకుంటే సమాజాన
చూపుతుందోయ్! ప్రభావము

హద్దులేని జీవితాలు
చిరిగిపోయిన కాగితాలు
దారము తెగిన  పతంగులు
నాశనమే కుటుంబాలు

ఇది అక్షర సందేశము
పాటించమని ఆదేశము
ఆచరిస్తే క్షేమము
లేకపోతే పతనము


కామెంట్‌లు