మాటలు;-ఉండ్రాళ్ళ రాజేశం -సిద్దిపేట -9966946084
 మాటలు మాటలు మాటలు
 మంచి మాటల కోవెలలు
 నలుగురు మెచ్చే మాటలు 
 నయగారా జలపాతాలు 
 సమాజం చెంత మాటలు 
 చెవినకింపుగా సొబగులు
 తప్పుడు మాటల తూటాలు 
 జనులు మేచ్చరెచ్చటను 
 మూర్ఖపు మాటల మోసాలు 
 వంకర మూతులై తిప్పుతరు జనాలు
మమకారమందు మాటలు
మధుమాసపు కోయిలలు
 మనసు నిండా మాటల కలబోతలు 
 ప్రేమామృత రస గుళికలు
 పిన్న పెద్దలు మాట్లాడే మాటలు 
 పదుగులు మెచ్చాలి ఎల్లవేళలు 
మాటలు మాటలు మాటలు
మానత్వపు కోటలు


కామెంట్‌లు