అమ్మ!!;- డా ప్రతాప్ కౌటిళ్యా
నాలుగు గదుల్లో ఏముంటుంది!!?
ఒక మది ఉంటుంది.!! అది అమ్మ!!

నదుల్లో ఏముంటుంది!!?
జల నిధి ఉంటుంది! అది అమ్మ!!

ఆకాశపు వీధుల్లో ఏముంటుంది!!?
నీలి మేఘం ఉంటుంది! అది అమ్మ!!

ఆలయాల్లో ఏముంటుంది!!!?
వెలిగే దీపం ఉంటుంది!! అది అమ్మ!!

హిమాలయాల్లో ఏముంటుంది!!?
కరిగే మంచు ఉంటుంది!! అది అమ్మ!!

అమ్మను 
నాలుగు గదుల్లో బంధించలేము.!!?
అమ్మకు 
సమాధులు నిర్మించలేము.!!!?

అజాతశత్రువు అమ్మ 
ఆకుపచ్చని ఆకు అమ్మ 
ముక్కు పచ్చలారని ప్రపంచం అమ్మ 
అందమైన చందమామ అమ్మ!!

ఒక జ్ఞాపకం కాదు అమ్మ 
వజ్రం అమ్మ!!
రాతి పలక పై అక్షరం కాదు అమ్మ 
రత్నం అమ్మ!!!

అక్షయపాత్ర అమ్మ!
పుష్పక  విమానం అమ్మ!!

ప్రపంచ స్మారక చిహ్నం అమ్మ!!
ప్రేమ కు చిహ్నం అమ్మ!!!

25-12-2024 
రాచకొండ -సి.పి -సుధీర్ బాబు గారి అమ్మ జ్ఞాపకార్థం రాసిన కవిత. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు