మాయ జామకాయలు:- -:ఎన్ శివ ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల

 అనగనగా అరవింద పురం అనే గ్రామంలో రాములమ్మ అనే ఆమె జామకాయలు అమ్మి బ్రతికేది. ఓ పేదరాలు ఉండేది, తన దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆమె తన బిడ్డ కూతురు,అయితే వాళ్ల కూతురు అల్లుడు ఎప్పుడూ గొడవ పడేవారు, అలా రాములమ్మ బిడ్డని హింసించేవారు,ఆమె చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, ఇక అల్లుడు నాకేమీ పటనట్టు ఎక్కడో వెళ్లిపోయాడు అసలు ఉన్నాడో లేడో! అప్పుడు రాములమ్మ బాధపడి తన మనవరాలిని సాదుకుంటుంది, ఎప్పుడు తన మనమరాలి ముఖం చూసి బాధపడుతూ ఉండేది, మళ్లీ తన వృద్ధాశ్రమంలో తనకేమైనా అయితే తన మనవరాలి పరిస్థితి ఏంటి మళ్లీ తన చదువుకి ఎలా పైసలు కట్టాలి అని ఆలోచిస్తూ రోజులు గడిచిపోతున్నాయి,తన మనుమరాలుది పదోవ తరగతి పూర్తి అయింది. ఇక పై చదువులు చదవడానికి పైకం కావాలి,కానీ రాములమ్మ పేదరికం దాన్ని దహించి వేస్తుంది. అదే ఆలోచనలో రాములమ్మ జామకాయలని తోటలో కోసి గంపలో పోసింది, ఆమె జామకాయలు రఘురాం అనే ఓ ధనవంతుడి తోటలో జామకాయలు కోసి అమ్మేది, ఆరోజు దీర్ఘంగా ఆలోచిస్తూ బాధ మరియు అలసటలో రాయి పై కూర్చుంది,పక్కనే గంపలో జామకాయలు పెట్టుకొని ఆలోచించి, ఆలోచించి ఏమి లాభం లేదు నేను చాలా పేదరాలిని ఎందుకమ్మా నాకు అంతా పేదరికాన్ని ఎందుకు ఇచ్చావు అని బాధపడింది,ఏడ్చి ఆలోచించి ఏమి లాభం లేదు, కనీసం ఈ జామకాయలు అమ్మినా మనవరాలి ఆకలి తీరుస్తాను అంటూ నడవ సాగింది,అలా దారిలో వెళుతుండగా ధనవంతుడి,భార్య ఆపి, ఓ జామకాయలు అమ్మే ఓ పెద్దమ్మ రా! అని పిలిచింది,వెంటనే వెళ్లి గంప దించి, ఎన్ని కావాలమ్మా అని అడిగింది,గంప వైపు చూసిన ఇద్దరు మహిళలు ఆశ్చర్యానికి లోనయ్యారు,రాములమ్మ కళ్ళచిమ్మగిల్లాయి. ఓ ధనవంతుడి భార్య మాకు జామ పండ్లు అన్నీ ఇచ్చేయ్. ఒక్కో దానికి ఎంత ఖరాదేసుకుంటావో! నీ ఇష్టం అని చెప్పి పది లక్షలు ఇవ్వడం జరిగింది,దాంతో రాములమ్మ చాలా సంతోషించి తన మనవరాలిని చదివించి ప్రయోజకురాలిని చేయించింది.
      

కామెంట్‌లు