రిజర్వేషన్ భోగీలలో ప్రయాణం చేసే స్తోమత లేనివారికి , రిజర్వేషన్ దొరకక అత్యవసర పరిస్థితులలో ప్రయాణం చేసేవారికి ప్రయాణ సౌలభ్యం కోసం గతం లో జనరల్ భోగీలను కనీసం ఆరు లేదా భోగీలను రైల్వే శాఖ ఏర్పాటు చేసేది. అట్లే మహిళలకు, వికలాంగులకు కూడా ప్రత్యేక భోగీలు వుండేవి.అయితే ఆదాయం కోసం ఏ సి, స్లీపర్ భోగీలను ఎక్కువ చేసిన రైల్వే శాఖ రైలులో 24 మాత్రమే భోగీలు గరిష్టం గా వుండడం వలన, ఆ మేరకు జనరల్ భోగీలను తగ్గించివేసింది.
ప్రస్తుతం ప్రతీ రైలులో రెండు లేదా మూడు మాత్రమే వుండే జనరల్ భోగీలలో వందలాది ప్రయాణీకులు సర్దుకు వెళ్ళవలిసి వస్తోంది.అట్లే పేద వారికోసం పాసింజర్ రైళ్ళను పెంచాల్సింది పోయి, గతం లో ప్రయాణికులకు ఎంతో సౌకర్యం గా వున్న రేపల్లె సికింద్రాబాద్, విజయవాడ - రాయగడ వంటి పాసింజర్ రైళ్ళను కూడా ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా మార్చివేయడం అనుచిత చర్య.జనరల్ భోగీలలో ప్రయాణీకులు పడే నరకం వర్ణనాతీతం.మరుగు దొడ్ల వద్ద నిల్చోవడం, ఫుట్ బోర్డుల దగ్గర కూర్చోవడం లాంటి కష్టాలు ఎన్నో పడాల్సి వస్తోంది.పని చెయ్యని. ఫ్యాన్లు, దుర్వాసన వెదజల్లే మరుగుదొడ్లు, నీళ్ళు రాని కుళాయిలు, కంపుకొట్టే భోగీలు లతో ప్రయాణం ఒక ప్రత్యక్ష నరకం. ఈ దేశం లో పేద, మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలు ఎనభై శాతం వరకు వున్నారు. ఆదాయం కోసం వారిని విస్మరించి ,కావలంటే విమానాలలో కూడా ప్రయాణం చేయగలిగే సంపన్న వర్గం సేవలో తరించేందుకు నిత్యం రైల్వే తపిస్తూ వుంటుంది. పండుగ, పబ్బాలు, రద్దీ సమయాలలో అదనపు భోగీలు ఏర్పాటు చేసే రైల్వే శాఖ అవి జనరల్ కాకుండా స్లీపర్లు లేక ఎ సి భోగీలు కావడం గమనార్హం. అన్నీ సాధారణ భోగీలే వుండే అంత్యోదయ రైళ్ళను విరివిగా ప్రవేశపెడతామన్న రైల్వే శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండు వందల కిలోమోటర్లకు తక్కువ దూరం వుందే నగరాల మధ్య షటిల్ పాసింజర్ రైళ్ళు నదపాలన్న ప్రతిపాదనను కుడా రైల్వే శాఖ బుట్టదాఖలు చెసేసింది. ఉన్నత, పై మధ్యతరగతి వర్గం ప్రజలు టికెట్లను అంతర్జాలం ద్వారా కొనుకునే సౌలభ్యం వుండగా, అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానంలేని వారు గంటల తరబడి స్టేషన్ లలో బుకింగ్ కౌంటర్ల ముందు యుద్ధం చేయాల్సి వస్తోంది. ద్వితీయ , తృతీయ శ్రేణి స్టేషన్ ల లో మౌలిక సదుపాయాల అంశాన్ని రైల్వే శాఖ పూర్తిగా విస్మరిస్తోంది.
రైలు ప్రయాణంలో ప్రత్యక్ష నరకం అని కొందరు ప్రయాణికులు అంటే ఎందుకు? రైలు వచ్చాక సంచులు మోసుకుంటూ పరుగెత్తుకుంటూ ప్లాట్‌ఫాంలు మారాల్సి వస్తుంది. మార్గమధ్యంలో ఎన్నిసార్లు ఆగుతుందో ఆగినప్పుడు మళ్లీ ఎప్పుడు ట్రైన్ కదులుతుందో తెలియదు. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ప్రయాణించాల్సి వస్తుంది.అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తుంది.
రైల్వే ప్రయాణం ప్రత్యక్ష నరకం:- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి