ఆరవ తరగతి పల్లెటూరి పిల్లగాడ పాఠంలో బొమ్మను చూసి సంభాషణలు రాయండి అనే అంశానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటికల్ నకిరేకల్ మండలం నల్గొండ జిల్లా ఆరవ తరగతి విద్యార్థిని సుంకర బోయిన సంజన రాసిన కథ
========================================================================================
అనగనగా ఒక ఊరిలో రాజు సోము అనే స్నేహితులు ఉండేవారు సోము చాలా పేదవాడు అందువల్ల తన దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకరోజు రాజు బడికి వెళుతుంటే సోము బడికి రాకుండా రాతిబండమీద కూర్చున్నాడు వెంటనే సోము దగ్గరికి వెళ్లి 'సోము ఏమిటిరా బడికి రాకుండా ఇక్కడ రాతిబండమీద కూర్చున్నావు?' అని అడిగాడు రాజు.
'ఏమి చేయమంటావు రా రాజు నేను బడి మానేశాను రా పశువులను కాస్తున్నాను' అని అన్నాడు సోము.
'బడి మానేస్తే ఎలాగ రా?' అని అన్నాడు రాజు.
'ఏమి చేయమంటావు రా! మేం పేదవాళ్ళం. అమ్మానాన్న కూలి పని చేస్తారు. వాళ్లకు వచ్చే కూలి చాలడం లేదు.' అని అన్నాడు అన్నాడు సోము.
' అయితే బడి మానేస్తావా?' అని అన్నాడు రాజు.
' ఏమి చేయమంటావు రా? మాది పేద కుటుంబం. అందుకని మా వాళ్లు నన్ను పశువుల కాపరిగా జీతానికి ఉంచారు' అని అన్నాడు సోము.
'మరి నువ్వు చక్కగా చదువుకుంటే ఈ కష్టాలన్నీ తీరుతాయి కదా!' అని అన్నాడు రాజు.
' చదువుకోవాలంటే పుస్తకాలకు కూడా డబ్బులు లేవురా. ఏమి చేయమంటావు? చూడు చిరిగిన చొక్కా తొడుక్కున్నాను. గోనె సంచిని కొప్పెరలా వేసుకున్న. తాటిజెగ్గలు చెప్పులుగా వాడుతున్న. చూడు నా పరిస్థితి ఎలా ఉందో?' అని అన్నాడు సోము.
' మరి ఇక్కడ తోడు ఎవరు రా?' అన్నాడు రాజు.
'ఇంకా ఎవరు తోడు నాకు ఈ చేతి కర్రే నాకు తోడు' అని అన్నాడు సోము.
'సోమూ నా మాట విను బడికి వచ్చి చక్కగా చదువుకో ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి' అని అన్నాడు రాజు.
' నా జీవితానికి వెలుగే లేదు రా. ఏమి చేయను? చూడు నా పరిస్థితి' అని అన్నాడు సోము.
' సరే నీ పరిస్థితి నాకు అర్థం అయింది. నేను దాచుకున్న డబ్బులతో నీకు పుస్తకాలు బట్టలు కొనిస్తాను ' అని అన్నాడు రాజు.
' నీ వంటి స్నేహితుల్ని నేను ఎప్పుడూ చూడలేదు రా. నా కష్టాలలో నువ్వు సగం పాలుపంచుకున్నావు. ఇదే నాకు చాలురా. ఇప్పుడు నాకు చదువు ఏమి వద్దులేరా' అని అన్నాడు సోము.
' మనం ఇద్దరం ఒకటే కదరా! మనం అన్నదమ్ములాంటి వాళ్ళం. నేను నీకు అన్నలాంటి వాన్ని కదరా! నేను కాక ఇంకెవరు సహాయం చేస్తారు నీకు?' అని అన్నాడు రాజు. 'ఇటువంటి స్నేహితుడు నాకు ఉండడం చాలా అదృష్టం. సరే సరే మరి పద వెళ్దాం' అన్నాడు సోము. ఈ విషయం అంతా వాళ్ళ నాన్నకు చెప్పి పశువులను నాన్నకు అప్పగించి బడి కి ఇద్దరు కలిసి వెళ్లారు. ఇలా రాము సోము అన్నదమ్ముల్లాగా జీవించారు. ఒకరు కష్టాలు ఒకరు పాలుపంచుకుంటూ సంతోషంగా ఉన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి