హాయిగా విరిసి మురిసే
ప్రకృతిలో...
వేయిగా కురిసే కళలేవో
వేకువలో!
మౌనం వీడిన మనసేదో
ఆలపించే
మధురగానం రాగమేదో
ఎరుగకనే!
చూపులు పరచిన దారిలో
నిలిపిన
మనసు తెరచిన తలపుల
వాకిట
అడుగుల సడికై ఎదురు చూసే
హృదయమే!
కళ్ళు తెరచిన చిన్నిపువ్వుల
పరిమళమేదో
వచ్చి వాలిన గాలితో కలిసి
చేయి కలిపి
పరిసరాల పరిభ్రమించి
పరిమళించే!
ప్రత్యూష వేళ పుడమి పైన
ప్రసరించు
ప్రభాకర కిరణాల పసిడి
కాంతులు
పడి పుత్తడి రేఖల గీసిన
చిత్తరువాయే!
అతిశయమైన అందాలు
దాచిన
అపురూపమైన అవని ముంగిట
వెలుగుల ముగ్గులేసి
మురిపముగా ముద్దులొలుకు
పొడిచే పొద్దు కాదా!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి