ప్రయాణమే జీవితం
ప్రతి గెలుపొక బహుమతి
ప్రతి ఓటమి ఒక పాఠం
ప్రతి దినమొక మరుజన్మం!
గడచిన ఏ క్షణము
మరల దొరకదు
సాగిపోయే ఏటిలో
జారిపోయే నీటిలా!
మనసేలాగో ఆలోచన అలా
ఆచరణ ఆలోచనలాగే!
మాయ కరిగి మర్మమెరిగేలోపు
మంచులా కరిగేపోవు సమయం!
గృహము శుభ్ర మయితే చాలా?
మనసు శుద్ధమవవద్దా?
పట్టిన బూజు దుమ్ము
పండగలకైనా వదిలోంచొద్దా?
ఎప్పటికప్పుడు చేసిన
తప్పులు తెలుసుకుని
ఒప్పుగా మార్చుకుంటూ
ముప్పులు తప్పించుకోవద్దా?
మనిషిగా పుట్టడం కాదు
బ్రతకడమే గొప్ప
ఎలాగోలా బ్రతికేయడం
జీవితం కాదు..
చేతనైన సహకారాలు
ఓపినన్ని ఉపకారాలు
చూపినన్ని మమకారాలే
మోసుకెళ్లే సంపదలు!
పెద్దలు చూపిన దారిలో
బుద్దిగా నడిచి
తరువాతి తరాలకు
సుఖ జీవన మార్గం చూపిస్తూ
తరించమని మరొక అవకాశంలా
వచ్చిన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి