తెలుసుకుందాం!:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 మహామొండి స్త్రీలను చండి అంటాం.ఔర్వుడనే మహర్షి కూతురు యోగమాయయే చండిపేరుతో పెరిగింది.అవునంటే కాదని కాదంటే అవుననే ఆమె అందరితో కొట్లాటలు అరుపులతో విసుగుచెందారు చుట్టుపక్కలవారు.ఆమెకు పెళ్లిచేయాలని తండ్రి ఎంత ప్రయత్నం చేసినా ఒక్కరూ ఆమెను పెళ్లాడటానికి ముందుకు రాలేదు.కానీ దుర్వాసుడు ఆమెను వివాహం వివాహంచేసుకుంటాడు. ఆయనకూడా మహా కోపిష్టి.భర్తను కూడా నిర్లక్ష్యంగా చిన్న చూపుచూసే చండీతో పాపం సర్దుకుపోసాగాడు.కానీ ఆమె ప్రవర్తన అహంకారం నిర్లక్ష్యంతో విసిగిన ఆయన బండరాయిగా మారమని శపించాడు.అప్పుడు బుద్ధితెచ్చుకున్న ఆమె భర్త కాళ్లపై బడి భోరుమంది. శాపవిమోచనం కి మార్గం చూపమంది. అశ్వమేధయాగానంతరం గుర్రంవెంట అర్జునుడు వస్తాడని అతని చేతిస్పర్శతో శాపవిముక్తి కలుగుతుందని అనుగ్రహిస్తాడు.అలా ఎన్నో ఏళ్లు గడిచాక పార్ధుని కరస్పర్శతో చండి నిజరూపంపొంది భర్త తో సఖ్యంగా ఉంటుంది.మొండిగా వాదించే స్త్రీల ను చండి  అని అంటారు.అలాంటి వనిత ఇంటాబైట అందర్నీ చిత్తంవచ్చినట్లు అంటూ అవమానాలపాలు కావటం ఖాయం.శ్రీకృష్ణుని అన్న బలరాముడని మనందరికీ తెలుసు. ఆయన భార్య రేవతి.ఆమె తండ్రి రైవతమహారాజు.ఆమెకు తగిన భర్త ఎవరో సూచించమని సరాసరి ఆయన బ్రహ్మదేవుని అడిగాడు.బ్రహ్మ అన్నాడు" రైవతా! నీవు నాలోకానికి వచ్చేప్పటికే కొన్ని యుగాలు గడిచాయి.నీకాలానికి చెందిన వారెవరూలేరు. కానీ ఆదిశేషుని అంశతో బలరాముడుపుట్టాడు.నీకుమార్తెకు అతనే తగిన వాడు." ఆమె కృతయుగం ఆయన ద్వాపరయుగానికి చెందినా  అన్యోన్య దాంపత్యంతో ఆదర్శజంటగా నిలిచారు.శ్రీకృష్ణుని అన్న బలరాముడని మనందరికీ తెలుసు. ఆయన భార్య రేవతి.ఆమె తండ్రి రైవతమహారాజు.ఆమెకు తగిన భర్త ఎవరో సూచించమని సరాసరి ఆయన బ్రహ్మదేవుని అడిగాడు.బ్రహ్మ అన్నాడు" రైవతా! నీవు నాలోకానికి వచ్చేప్పటికే కొన్ని యుగాలు గడిచాయి.నీకాలానికి చెందిన వారెవరూలేరు. కానీ ఆదిశేషుని అంశతో బలరాముడుపుట్టాడు.నీకుమార్తెకు అతనే తగిన వాడు." ఆమె కృతయుగం ఆయన ద్వాపరయుగానికి చెందినా  అన్యోన్య దాంపత్యంతో ఆదర్శజంటగా నిలిచారు.
కామెంట్‌లు