నీ వేణు గానలహరి లో..:-కోరాడ నరసింహారావు

 నీ వేణు గానలహరి లో..
 ఇహము మరచు పరవ శము..! 
 శ్రీ కృష్ణా నీ సహ చర్యము, జన్మ-జన్మల పుణ్యము..!! 
  రేపల్లె, యమునాతటి, బృందావనములదే కదా భాగ్యము..! 
  ఆనంద నంద బాలకా... ఎన్నినోములు 
నోచెనో,య సోదమ్మ...నిన్నుబిడ్డగా లాలించి పెంచగా....!! 
   దేవకీ, వాసుదేవు లేమి పాపములు జేసిరో ... 
కన్నంతనే నిన్ను ఎడబాసి నీ ముద్దు ముచ్చటల్ గాంచ రైరి....! 
  కుచేలు డెంత అదృష్ట వంతుడో...నీతోనెయ్య మొనర్చి భాగ్యమునుపొం దె..! 
  గోప బాలు రెన్ని జన్మలు తపములొనరించిరో నీతో కలిసి ఆట లాడు కొనగ..! 
   గోపిక లెన్ని జన్మ ములు లెన్నెన్ని పూజలు చేసిరో , 
నీ యాగడముల ఆటపట్టింపులనుభవింప! 
   గీతబోధించి,ఆదిగురువై సుఖజీవన రీతి దెల్పి ... 
మమ్ముద్దరించిన మాపాలి దైవమా శ్రీ కృష్ణదేవా... 
  శరణు శరణు మమ్మిల గావు మయ్య...
 💐🙏💐

కామెంట్‌లు