ఎరుగట్ల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ సాహిత్య బహుమతులు.

 కెనడా దేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు పిల్లల కోసం వెలువడుతున్న గడుగ్గాయి అంతర్జాతీయ పత్రిక వారు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కథలుమరియు కవితల పోటీలలో ఎరుగట్ల విద్యార్థులకు బహుమతులు లభించాయి. గడుగ్గాయి పత్రిక వారు ప్రతి సంవత్సరం    నిర్వహించే    ఈ పోటీలలో               ఎరుగట్ల పాఠశాలలో ఏడవ తరగతిచదువుతున్న వేముల రూపక్ , పెరక రాజేష్,నవదీప్ రాసిన కవితలకు ఉత్తమ బహుమతులు లభించగా,శ్రీనిధి,అశ్విని,అభిలాష్, రిశ్వంత్, వైష్ణవి రాసిన కవితలు మరియు కథలకు ప్రోత్సాహక బహుమతులు, పదవ తరగతి చదువుతున్న ఆస్నిహా భాను రాసిన కథకు ఉత్తమ కథ బహుమతి లభించిందని, వీరికి త్వరలోనే నగదు బహుమతిని, ప్రశంసా పత్రాలను అందజేస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి తెలిపారు. అంతర్జాతీయ పరంగా పాఠశాల పేరును నిలబెట్టిన విద్యార్థులను అభినందించారు. సాహిత్య పరంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తెలుగు పండితులు ప్రవీణ్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, శ్రీనివాస్, రాజశేఖర్, విజయ్, పవన్, రాజ నరసయ్య, గంగాధర్, రాజేందర్, గంగా మోహన్, ట్వింకిల్, సమత ఇందిర పాల్గొన్నారు
కామెంట్‌లు