సుప్రభాత కవిత : -బృంద
మన పాలికి వచ్చినవన్నీ 
మహాప్రసాదంగా 
మనం పాలబడ్డవన్నీ 
మహా పాఠాలుగా 

మరొకరి నవ్వులకు 
మనం కారణమవుతూ 
మనసారా ఆనందంగా 
మనమూ నవ్వుతూ 

సంపదలేవి లేకున్నా 
సంతోషాలకు షావుకారులుగా 
సంతృప్త హృదయాలే 
సకల ఐశ్వర్యాలకూ నిలయంగా

సాయం చేసిన వారికి 
కృతజ్ఞతలు చెప్పుకుంటూ 
సహాయం అడిగినవారికి 
చేయూతలుఅందిస్తూ

గొప్పకు అభినందనలు 
తప్పనిసరిగా చెబుతూ 
తప్పును ఒప్పుకోక 
చెప్పి ఒప్పిస్తూ....

సొంతాలైన  బంధాలు 
నిలబెట్టుకుంటూ 
అంతా మనవాళ్లే నని 
మన్నించుకుంటూ...

సాగిపోదాం సంతోషంగా 
తేలిపోదాం ఉత్సాహం గా 
సోలిపోదాం ఆనందంగా  అంటూ 
దోసిట పోద్దాం శుభ కామనలు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు