ఆటల విలువ : సరికొండ శ్రీనివాసరాజు
 ప్రహర్షిత ఆ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చేది. చిన్నప్పటి నుంచి తనకు పోటీ ఎవరూ లేరు. దానితో కొంచెం గర్వం కూడా ఉండేది. కానీ ఎప్పుడూ చదువులో మునిగేదే కానీ ఆటల్లో అస్సలు పాల్గొనలేకపోయేది. 
      ఒకసారి జాతీయ పండుగ సందర్బంగా జరిగిన ఆటల పోటీలలో కబడ్డీ ఆట జరుగుతుంది. కబడ్డీలో అనుకోకుండా ఒక ప్లేయర్ గాయ పడటం వల్ల తప్పనిసరిగా ప్రహర్షిత ఆడాల్సి వచ్చింది. కూతకు అస్సలు వెళ్లడం లేదు. మిగతా ప్లేయర్స్ అంతా ఔట్ అవడంతో ప్రహర్షిత కూతకు వెళ్లాల్సి వచ్చింది. ప్రహర్షిత ఏ మాత్రం పోరాటం లేకుండా ఊరికే దొరికి పోయింది. ప్రహర్షిత ఆట చాలా దారుణంగా ఉంది. ప్రహర్షిత అవమానంగా భావించి ముఖం చిన్న బుచ్చుకుంది.
         ప్రహర్షిత స్నేహితురాలు సరస్వతి వచ్చి, "చదువు ఒక్కటే ఉంటే సరిపోదు. రోజూ ఆటలు కూడా ఉండాలి. లేకపోతే శరీరం సుకుమారమై ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం నాతో పాటు రా. రింగ్ బాల్ షటిల్ వంటి ఆటలు రోజూ ఆడదాం. మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది." అన్నది. ప్రహర్షిత ఒప్పుకుంది. 

కామెంట్‌లు