కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఉదయాన్నే పిల్లలు ప్రత్యేకమైన దుస్తుల్లో అందంగా ముస్తాబై పాఠశాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉపాధ్యాయులు పిల్లలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాదాపుగా రెండు గంటల పాటు పిల్లలు రకరకాల రంగు రంగుల రంగులు వేశారు. అనంతరం పతంగులు ఎగరవేశారు. సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. రేపటి నుంచి పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలు ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, పండుగ ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. పాఠశాలలో పిల్లల కోసం పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి పాఠశాలలోనే చేర్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యతో పాటు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, బండారు స్రవంతి, పిల్లలు పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి