శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కంది మండలంలోని ఆయుధ కర్మాగారం కు చెందిన శ్రీ వివేకానంద స్టడీ సర్కిల్ వారు పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. దీనిలో ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బహుమతులు సాధించారు. రంగోలిలో 9వ తరగతి చెందిన సృజన ద్వితీయ బహుమతి, ఉపన్యాస పోటీలో 9వ తరగతి చెందిన పావని ద్వితీయ బహుమతి, చిత్రలేఖన పోటీలో పదవ తరగతికి చెందిన స్వాతి ప్రథమ బహుమతి పొందినట్లు వారు తెలిపారు. ఈ బహుమతుల్ని ఓడిఎఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ సి వి ప్రసాద్ అందజేశారు.
రంగోలిలో బహుమతులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి