ధైర్యంగా బతికేద్దాం : - ఐలేని గిరి
కొంత సంతోషాన్నిచ్చి
ఎన్నో గాయాలు చేసి 
చావులని రుచి చూస్తూ
కాలం ఒక క్యాలెండర్ని 
మడిచి మింగేసింది 
మొగ్గలు విచ్చుకోవాల్సిన చోట కొంత విషాదం
పూలు  పరిమళించిన చోట కొంత ఆనందం
కాలం ఏ నిమిషాన్నీ ఒకలా గడపదు 
రోజులు కరిగి గతించిపోయినయ్,..

భూమ్మీద ఓ మొలక కళ్ళు తెరిచినట్టు
మరో కొత్త దినం మరో కొత్త సంవత్సరం 
మరో  క్యాలెండర్-
అన్నింటికీ సిద్ధపడుతూ
ఆశావహంగా ఆహ్వానిద్దాం
ఏమైతే అయింది ధైర్యంగా బతికేద్దాం...
            &&&. &&&

కామెంట్‌లు