ఊరు గొప్పదనం:- - బస్వ శివ-ఎనిమిదవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 అనగనగా ఒక ఊరు ఉండేది, ఆ ఊరు పేరు ఆకారం, ఆకారంలో ఒక గుడి ఉండేది, ఆ గుడి పేరు సూర్య దేవాలయం గుడి, ఆ గుడిని పూర్వకాలంలో ప్రజలందరూ బాగా దర్శించేవారు, కానీ ఇప్పుడు ఆ గుడిని ఎవరు దర్శించడం లేదు, ఆ గుడిలో ఉన్న సూర్య దేవాలయాలు కొందరు దొంగలు దొంగిలించుకుపోయారు, ఆ గుడి ఉందని ప్రజలకు కొంతమందికి తెలియదు, ఆ గుడి ఉందని కొన్ని రోజుల క్రితం తెలిసింది ,అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ గుడి దగ్గరకు పోవాలని అనుకున్నారు, అప్పుడు ఆ గుడి చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. అయినా  ఆ ఇద్దరు చెట్లను దాటుకొని ఆ గుడి లోపలికి వెళ్లారు,ఆ గుడిలో మొత్తం గుంటలు తీసి ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆ ఇద్దరు వ్యక్తులు గుడిలో ఇలా అనుకున్నారు ఒకటో వ్యక్తి బంగారంలో తో కూడిన సూర్యదేవాల విగ్రహాలు ఉంద ని విన్నాం కదా! కానీ ఇక్కడ ఏం లేవుగా, రెండో వ్యక్తి ఇలా అన్నాడు నాకు తెలిసి గుడిలో ఉన్న సూర్యదేవాలయాలను దొంగలు దొంగిలించకపోవచ్చు, ఆ ఇద్దరు గుడిలో నుంచి బయటకు వచ్చారు వచ్చినంక ఇద్దరు ఆకారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లారు మీ పేరు ఏమిటి అని ఆ ఇద్దరు వ్యక్తులు అడిగారు, ఆ వ్యక్తి అ నా పేరు సైదులు,ఈ ఆకారం సూర్యదేవాలయం గుడి ఉండేది అవునా అని అన్నాడు, అప్పుడు అతను అవును ఒకప్పుడు ఈ గుడిలో సూర్య దేవాలయాలు ఉండేవి ,ప్రజలందరూ ఆ గుడిని దర్శనం చేసుకునేవారు కొన్నివేల క్రితం గుడిలో ఉన్న సూర్య దేవాలయాలను దొంగలు దొంగిలించుకుపోయారు అన్నాడు సైదులు, వాళ్ళు ఈ సూర్యదేవాలయాల గురించి తెలుసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు, ఆ దేవాలయానికి ప్రభుత్వం మంచి అభివృద్ధి చేస్తుంది అని చెప్పారు

కామెంట్‌లు