చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
 *కందం*

మరిచియు తాళము నొత్తియు
అరచిన శబ్దమున కుక్క యాదికివచ్చెన్
వెరచిన నేమియు లాభము
తెరవను చెవిలోన కలదు తీయుట యెట్లన్



*ఆటవెలది*


తలుపు గొళ్ళమెట్టి తాళమొత్తిన బాల
అరుపునందు కుక్క మరుపువీడి
మదిన చెవిని వెతుక మార్గంబు కోరుతూ
గుండె కొట్టుకునెను గుర్తులందు

కామెంట్‌లు