పున్నమి రోజు చంద్రుడు
ముద్దు ముద్దుగా ఉంటాడు
వెండి రంగు కిరణాలతో
నేలపై వెలుగులు చల్లుతాడు
సముద్రం చెంతకు కొచ్చి
దోబూచులాడుతూ
ఆటుపోటు కెరటాలను
ఎంతో ఎత్తుకు ఎగిరిస్తాడు
కిరణాలతో కిందికి వస్తాడు
అలలను పై పైకి రమ్మంటాడు
అందకుండా పైకి ఎగురుతూ
హాయిగా ఆటలాడుతాడు
ఆటపాటలతో జాబిలమ్మ
ఆ రాత్రంతా నవ్వుతూ
రంగురంగుల కలువలతో
సప్త స్వరాలు పలికిస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి