అష్టాక్షరీ గీతాలు:- కోరాడ నరసింహా రావు

 నీడ నిజమను కోకు
  నిజం నిలకడ మీదే... 
  తొందర పడి అనకు
  అపోహకు తావివ్వద్దు
        *****
సత్యాన్ని నమ్మ రెవరు
  అసత్యమే నమ్మెదరు
  దేన్నీ గుడ్డిగా నమ్మద్దు
  అపోహకు తావివ్వద్దు
   ******
పుకార్లు షికార్లు చేస్తే
 నిజం మరుగైపోతుంది
   పరనింద మహా పాపం
  అపోహకు తావివ్వద్దు
     ******
కామెంట్‌లు