ఉదంకుని గురుభక్తి ఎంతో గొప్పది.వ్యాసమహర్షికి ఎంతోమంది శిష్యులు.పైలుడనే శిష్యుడు తపోధనుడు.ఈయన శిష్యుడే ఉదంకుడు.అణిమాది అష్టసిద్ధుల్ని పొందిన ఉదంకుడు గురుదక్షిణగా ఆయన భార్య అడిగిన పౌష్యమహారాజు పత్ని చెవికుండలాలు తీసుకురావటానికెళ్లాడు. మహారాణి ఆనందంగా అతనికిచ్చింది. కానీ ఓమాటచెప్పింది" నాయనా! తక్షకుడనే సర్పం వీటిని కాజేసే ప్రయత్నంలో ఉన్నాడు.జాగ్రత్త." ఉదంకుడు సంధ్యావందనంకై చెరువు గట్టున పెట్టి నీటిలో దిగాడు.సమయంకోసం ఎదురుచూస్తున్న తక్షకుడు వాటిని కాజేసి నాగలోకానికెళ్లిపోయాడు. ఉదంకుడు అష్ట కష్టాలుపడి నాగలోకానికెళ్లి తక్షకుడిదగ్గరనుంచి కుండలాలు తీసుకుని గురుపత్ని కిస్తాడు. ఆనాటి గురుశిష్యుల సంబంధం అపూర్వంవిశ్వరూపుడి గూర్చి మనకంతగా తెలీదు.త్వష్ట అనే ప్రజాపతి కొడుకు విశ్వరూపునికి మూడు తలలుండేవి.గురువుగా దేవతలమన్ననలందాడు.నారాయణ కవచం ఉపదేశంని ఆయన దగ్గరే ఇంద్రుడు పొందినా కోపం వచ్చి ఆయన మూడు తలలు ఖండించాడు. విశ్వరూపుడు రాక్షసులకు యజ్ఞభాగాలు ఇవ్వడం ఇంద్రుడికి నచ్చలేదు.బ్రహ్మ హత్యాదోషం పోగొట్టుకొనటానికై ఇంద్రుడు భూమి నది చెట్టు స్త్రీల కు వరాలిచ్చాడు.భూమి పూడిపోతుంది గోతులుతీసినా! కలుషిత మైనా నది పవిత్రమైనదే చెట్టునికొట్టేసినా చిగురిస్తుంది. సంతానభాగ్యం స్త్రీల కిచ్చాడు.ఈప్రపంచంలో బంధాలు అనుబంధాలు బతికున్నన్నాళ్లు తప్పవు.శివం శవంగా మారాక ఎవరికి ఎవరో? భాగవతంలో కథ ఇదే చెప్తోంది.శూరసేన రాజైన చిత్ర కేతుడికి సంతానంలేదు. పుత్ర కామేష్టియాగంతో పట్టపురాణికి కొడుకు పుట్టాడు.మిగతా రాణులు అసూయ తో ఆపిల్లాడికి విషమిచ్చి చంపుతారు.రాజురాణీ దు:ఖంతో విలపిస్తుంటే నారదుడు వచ్చి ఓదారుస్తాడు. ఆబాలుని దేహంతో అంటాడు"ఓజీవా! నీకోసం మీఅమ్మనాన్న ఏడుస్తున్నారు.తిరిగి దేహంలోకి ప్రవేశించు.""ఎన్నో జన్మలెత్తాను. ఒక్కొక్క జన్మలో వేర్వేరు తల్లిదండ్రులు బంధువులు.నాకోసం కొత్త అమ్మ నాన్నలు ఎదురుచూస్తున్నారు.వస్తా" అని మాయమైనాడు. అప్పుడు రాజు మోహంతొలగిపోయింది. అంతిమ సంస్కారాలు చేసి నారదుడు ఉపదేశించిన నారాయణ మంత్రంతో జన్మ సార్ధకం చేసుకున్నాడు.బంధువులు భార్య భర్త పిల్లలు అంతా ఋణానుబంధం అశాశ్వతం.దైవధ్యానంలో తరించటంలోనే జన్మ సార్థకత 🌷
తెలుసుకుందాం! :-సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి