ఒక పిట్ట కథ:- బండారు రాకేష్-ఆరవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి, ఒకరోజు అడవికి నిప్పు అంటుంది ,అది నెమ్మదిగా పెరగసాగింది అడవి మొత్తం వ్యాపించింది, పక్షులు జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటలో పడి చచ్చిపోతూ ఉన్నాయి, కానీ ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయ సాగింది, అది చూసిన ఒక కొంగ ఓసి తిక్కదానా నీవు పిడికెడు అంత లేవు, నీ చేత ఏమైతది నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు ఇకనుండి వెళ్ళిపోయి, నిన్ను నువ్వు కాపాడుకో పో ఇక్కడ ఉండకు అని అన్నది, అప్పుడు ఆ పిట్ట చిరునవ్వుతోనే నిజమే నువ్వు అన్నది, కానీ నా ఒక్కదానితో కాకపోవచ్చు కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది, అడవిలో అన్ని చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది ఆ మాటలను కొంగ తో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి, నిజమే కదా అనుకున్నాయి తనలో తాను, వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం  ఇక ఆపివేసి మంటల మీద నీళ్లు చల్లడం మొదలుపెట్టాయి, అప్పుడు మంటలు ఆరిపోయాయి, అందరూ కలిసి అడవిని కాపాడుకోవడం జరిగింది.

ఈ కథలోని నీతి: అందరూ కలిస్తే ఏదైనా సాధించవచ్చు

కామెంట్‌లు