మంచం మీది తాతయ్య
మంచినీళ్లు అడిగాడు
చెంచులక్ష్మి వచ్చింది
కొంచెం నీళ్లు తాపింది
మంచె మీది మామయ్య
సుంచన కోటకు వెళ్లాడు
సంచులు రెండు చింపాడు
కుంచెలు కట్టి తెచ్చాడు
కంచెకు అతడు వెళ్ళాడు
కుంచెకు కట్టెలు తెచ్చారు
వంచన లేని పనులతో
కుంచడు బియ్యం అడిగాడు
కంచుకోటలో దూరాడు
కొంచెం బువ్వ వండాడు
కంచము ఒకటి తెచ్చాడు
అంచుకు కారం పెట్టాడు
నంచుకుని అతడు తిన్నాడు
పంచులు కొన్ని వేశాడు
పంచకు వచ్చి నిలిచాడు
పంచ కప్పకుని పన్నాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి