రైతన్న నోట
మాటల తూటాల మోత
మీ నోటి రుచులకు,
ప్రపంచ గతులకు,
నా చేతి పంట
ఏకైక దారంటాను నేను.
చేనులో నా చేయి
చేరితేనే గదా
మీ నార్కపై నిండు
నానా రుచుల విందు
నా ఘర్మ జలంతో
నేను పండించిన పలు రకాల పంటలే
మీ లాలాజలానికి
శ్రీరామరక్ష.
మా పంట పండితే
మీ కడుపు నిండు.
ఎంత పండించిన
కడుపు నిండని బ్రతుకు
మా కుటుంబానిదే..
ఓ చిన్న పని చేస్తే థాంక్స్ థాంక్స్ అనుకొంటారు మిరు.
మీ కడుపు నింపేటి
సైరికుడ నేను
నాకు థాంక్స్ లు వద్ద
కాస్తంత ప్రేమాభిమానాలు, చూపండి చాలు.
అన్నం పెట్టలేని స్థితి
మాది,ఇక
బిడ్డలకు చదువు, ఉద్యోగ, వివాహలు
ఏ రీతి జరుగు.
ప్రభుత్వం ప్రజలు చెప్పాలి తీర్పు.
ఓర్పుగా, ప్రపంచ
పచ్చదనానికి,
పైరులను పెంచే
రైతును నేను.
నాఘర్మ జలాలకు
ఖరీదు కట్టి,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి