11.
పాలనమ్మగ గొల్లవారలు బైలుదేరిరి పూనికన్
జాలరుల్ చొరెఁ జెర్వులందు విసారి జాలముఁ బట్టగన్
మాలఁ గట్టిరి బాపనయ్యలు మాపతీ! తమ సన్నిధిన్
ఏల మాంద్యము? వేంకటేశ్వర! మేలుకో ధరనేలుకో!
నిఘంటువు:
పూనిక= ఉత్సాహం
విసారి జాలము= చేపల గుంపు
మాపతీ= లక్ష్మీపతీ
మాంద్యము=ఆలస్యము
12.
పూలు పూసెను తావి జల్లుతు పూని మీ మెడ చేరగాన్
పాలు చేపెను గో సమూహము బాళి బోగము నివ్వగాన్
గాలి సేసెను వేణుగానము గంధమీనుతు లెమ్మనిన్
ఏల జాలము? రంగనాయక! మేలుకో ధరనేలుకో!
===========================
నిఘంటువు:
తావి= సువాసన
గో సమూహము=ఆలమంద
బాళి= ప్రేమ/కాంక్ష/సంతోషం
బోగము= నైవేద్యం
జాలము= ఆలస్యము
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి