కోడి పందెం : -. కోరాడ నరసింహా రావు
రోషాలు పొడుచు కొచ్చి... 
 మీసాలు మెలిపెట్టి... 
   కాళ్లకు కత్తులు కట్టి... 
   బరిలోకి దింపు తారు...!

 విచక్షణ లేని ప్రాణులు
    స్వ జాతియే నని ఎరుగరు
   రక్తా లోడినా , పోరు ఆపరు
   చివరి వరకూ కొట్టుకుని - కొట్టుకుని , ప్రాణా లొదులుట...! 
  గెలిచిన ఇంట కోడి కూర విందు, మందు ఆనందపు పొందు...! 

పండగ పూట.....
  ఓడి నింట ... విషాదం!! 
      *****


కామెంట్‌లు