వేసవి సెలవుల్లో రాము అమ్మమ్మ ఇంటికి పల్లెటూరి వెళ్దామని అనుకుటాడు. అక్కడికి తమ పిన్ని మరియు పెద్దమ్మ పిల్లలు కూడా వస్తారు కాబట్టి కరవు తీరా ఆడుకోవచ్చని రాము ఆలోచన. కానీ అపుకోని పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. కానీ రాము చెల్లెలు శివానీకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చింది. రాము మరింత నిరాశకు గురి అయ్యాడు. రాము పట్నంలోనే ప్రాణ స్నేహితుడు వాసును కలుసుకుని, క్యారమ్స్, షటిల్ వంటి ఆటలు తనివి తీరా ఆడినాడు.
సెలవులు అయిపోయినాయి. శివాని ఇంటికి వచ్చింది. రాము చెల్లెలితో "సెలవులు ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చావు కదా!" అన్నాడు. "నువ్వు కుళ్ళుకోబట్టే ఏమీ ఎంజాయ్ చేయలేక పోయాను. ఇంటిల్లి పాదీ ప్రతి వేసవిలో టీవీలో వచ్చే కాసుల ఆటలకు అతుక్కుపోయినారు. అందులో ఒక టీం గెలిచిందంటే మన వాళ్ళలోనే ఒకరిద్దరికి మోదం, మరి కొందరికి ఖేదం,. బాబోయ్! దేశ సమైక్యతను దెబ్బ తీసే ఇలాంటి ఆటలతోనా విలువైన సమయాన్ని వృథా చేయడం. మిగతా సమయమంతా టీవీ ప్రోగ్రామ్స్ మరియు మొబైల్ ఫోన్లతో కాలక్షేపం. మనుషుల అంత మంది ఉన్నా ఒకరితో మరొకరికి సంబంధాలూ శూన్యం. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల వేసవి సెలవులను ఎలాగో అలా ఎంజాయ్ చేసావు. మళ్ళీ వెనుకటి రోజులు ఎప్పుడు వస్తాయో." అన్నది శివాని. రాము అమ్మమ్మ ఇంటికి పల్లెటూరి వెళ్ళిన వారితో పోలిస్తే తాను బాగా ఎంజాయ్ చేసానని తెలిసకున్నాడు.
వేసవి సెలవుల్లో : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి