శాస్త్రీయ రాజకీయరంగం-ఉపాధి!!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా
 ఏ రాజకీయాలయితే యువత నిరుద్యోగానికి కారణమైందో అవే రాజకీయాలు యువతకు ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్తే ఆశ్చర్యపోతాం. రాజకీయాలకు చాలా భవిష్యత్తు ఉంది. దేశ ప్రగతికి కారణమైన అన్ని పారిశ్రామిక విద్య సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అన్ని వ్యాపార రంగాల కన్నా పెద్ద రంగం రాజకీయ రంగం. అంటే నిరుద్యోగులకు విద్యావంతులకు యువతకు ఉపాధిని కల్పించే సత్తా రాజకీయ రంగానికి ఉంది. 
ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడిపే ఐదు సంవత్సరాల బడ్జెట్ కన్నా పదింతల బడ్జెట్ను ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ఖర్చు పెడుతుంది. అంటే ఒక దశాబ్దం పాటు దేశాన్ని నడిపే బడ్జెట్ ఎన్నికలకు ఖర్చు పెట్టినప్పుడు అది తప్పకుండా ఒక గొప్ప పారిశ్రామిక రంగంగా భావించక తప్పదు. అంటే సంపద సృష్టించే రంగం అన్నమాట. దీంట్లో భాగస్వాములు ఎవరు. ప్రజలు కార్యకర్తలు మాత్రమే. కనుక కార్యకర్తలకు తాత్కాలికంగా కాదు శాశ్వత ఉపాధి కల్పిస్తే సరిపోతుంది. అలాగే ప్రజలను కూడా భాగస్వాములను చేయాలంటే కుటుంబానికి ఒకరికి మరియు పార్టీ సానుభూతిపరులకు  ఒకరికి ఉద్యోగం కల్పిస్తే సరిపోతుంది. 
రాజకీయ పార్టీలు గెలిస్తే సంక్షేమ పథకాలు ఉచిత పథకాల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారో అలాగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పిస్తే చట్ట వ్యతిరేకమేమీ కాదు. కాబట్టి చట్టపరంగా బాధ్యత యుతంగా యువతకు కార్యకర్తలకు పార్టీ సానుభూతిపరులకు రాజకీయ పార్టీలు సంపదను సృష్టించి ఉపాధి కల్పించడం ఒకరకంగా ప్రతి రాజకీయ పార్టీని ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా మార్చవచ్చు. 
అంటే రాజకీయ పార్టీలు గెలిచినా ఓడిన సంపద ఎలాగూ ఖర్చు అవుతుంది. అది కార్యకర్తలకు అంటే యువతకు పార్టీ సానుభూతిపరులకు కుటుంబానికి ఒకరికి ఉపాధి ఉపాధి రూపంలో చేరితే బాగుంటుంది. అన్ని రాజకీయ పార్టీలు శిక్షణ కార్యకర్తల కోసం ఒక ఉన్నత రాజకీయ పాఠశాలలను నడిపి శిక్షణ కార్యకర్తలను నాయకులను తయారుచేసి పార్టీలోకి తీసుకుంటే సమాజానికి వ్యవస్థకు రాజకీయరంగం మేలు చేసింది అవుతుంది. రాజకీయ రంగం ఒక స్వచ్ఛమైన శాస్త్రీయ రంగంగా మారుతుంది. దీనికి మార్గం అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నత రాజకీయ పాఠశాలలను నెలకొల్పడమే ఆదర్శం. 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి శుభాకాంక్షలు .వినతి.
డా.ప్రతాప్ కౌటిళ్యా
రిటైర్డ్ లెక్చరర్ టీచర్స్ కాలనీ పాలెం-509215, ఫోన్ 8309529273.

కామెంట్‌లు